నిజామాబాద్ ప్రతినిధి డిసెంబర్22: (ఆంధ్రప్రభ,)ఇందూర్ లో ఆరట్టు ఉత్స వం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో గల అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరట్టు ఉత్స వానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, నగర మేయర్ దండు నీతు కిరణ్ లుముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ అర్బన్ ఎమ్మెల్యేకు ఘనంగా స్వా గతం పలికి సన్మానించారు.
ఈ సంద ర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఊరేగింపు శోభాయాత్రను ప్రారంభించారు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం ఎంతో పుణ్యఫలం అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు
ఆలయంలో ఆలయ పూజారి ఉదయం స్వామి వారికి సుప్రభాతసేవ, విశేష స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు.
స్వామివారి ఊరేగింపుకు మంగళ హారతూలతో ఘనస్వాగతం
స్వామివారి ఉత్సవ విగ్రహా న్ని పల్లకిలో ఉంచి నిజామ బాద్ నగరంలోని ప్రధాన వీధుల గుండా స్వామి వారిని ఊరేగించారు. ఈ శోభాయాత్ర అయ్యప్ప ఆల యం నుంచి బయలుదేరి కంటేశ్వర్ కమాన్ , ఎన్టి ఆర్ చౌరస్తా, కోర్టు చౌరస్తా, వీక్లీ బజార్, గోల్డ్ హనుమాన్ పెద్ద బజార్, జిల్లా చౌరస్తా మీదుగా మినీ ట్యాంక్ బండ్ వద్ద గల బొడ్డెమ్మ చెరువు వరకు కొనసాగుతుంది.
శోభాయాత్రలో భాగంగా స్వామివారి ఊరేగింపుకు నగరంలోని ప్రధాన వీధుల్లో మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. శోభాయాత్రకు వాడవాడనా స్వామివారికి రోడ్డుపై పువ్వులతో ప్రత్యేకంగా అలంకరించారు.
అయ్యప్ప స్వాములకు పాలు పండ్లు సేవచేసుకుని తరించిన అయ్యప్ప భక్తులు
ఆరట్టు ఉత్సవం సందర్భంగా శోభాయాత్రలో పాల్గొన్న అయ్యప్ప స్వాములకు వాడవాడనా పాలు పండ్లు సేవ చేస్తూ అయ్యప్ప భక్తులు స్వాముల సేవలో తరించారు. పోచమ్మ గల్లి పెద్ద బజార్ చౌరస్తా వద్ద.. ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించి గత కొన్ని సంవత్సరాల నుండి అరటిపండ్లు పాలు అందజేస్తూ స్వామి వారి నామస్మరణతో భక్తులు తరించారు.
అలరించిన అయ్యప్ప స్వాముల పెట తులయ్యాట..
శోభాయాత్రలో అయ్యప్ప స్వామి నామస్మరణతో ఇందూరు మారుమోగింది. ప్రత్యేకంగా అయ్యప్ప స్వాములు స్వామి వారి సంకీర్తనలతో పేటతుల య్యాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రత్యేక ఆకర్షణగా మహిషీ వేషధారణ…
హారతు శోభాయాత్రలో మనిషి వేషధారణలో సంజీవ్ స్వామి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చేతిలో గధ తో ప్రత్యక్షంగా మహిషిని తల పించేలా… హావాభావాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మహిషి వేషధారణ ఉన్న సంజీవ్ స్వామితో అయ్య ప్పలు సెల్ఫీ తీసుకోవడానికి పోటీపడ్డారు. నిజామాబాద్ నగరంలో ఎక్కడైనా అయ్యప్ప స్వామి మహా పడిపూజ చేపట్టినా అక్కడ సంజీవ్ స్వామి బోలా శంకరుడు సాయిబాబా, మహిషి, ఆంజనేయ స్వామి వేషధారణలో… స్వాముల్లో ఆధ్యాత్మిక భావాన్ని నింపు తాడు.
అదేవిధంగా శ్రీధర్మా శాస్త్ర అయ్యప్ప స్వామి వేషధారణలో చిన్నారి, మణి కంఠుల వేషాధారణ అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు భక్తవత్సలం నాయుడు, అర్చకులు రమేష్ శర్మ, అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.