Saturday, November 16, 2024

Sree Rama’s Wedding | భ‌ద్రాద్రికి పోటెత్తిన భ‌క్తులు.. కాసేప‌ట్లో సీతారాముల క‌ల్యాణ మ‌హోత్స‌వం

సీతారామ కల్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో వధూవరులైన సీతారాములు కల్యాణ మండపానికి వేంచేయనున్నారు. ఉదయం 9:30 గంటలకు కల్యాణ మూర్తులను వేదమంత్రోచ్చారణల నడుమ ఊరేగింపుగా లక్ష్మణ సమేత శ్రీసీతారాములు కల్యాణ వేదికైన మిథిలా ప్రాంగణానికి రానున్నారు.

మిథిలా ప్రాంగణంలో 10:30 గంటల నుంచి కల్యాణతంతు ప్రారంభ‌మ‌వుతుంది. సరిగ్గా మధ్యా హ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్‌ లగ్న సుమూహూర్తాన కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. స్వామివారి క‌ల్యాణాన్ని తిల‌కించేందుకు భ‌ద్రాద్రికి పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లిరావ‌డంతో జ‌న క‌ళ సంత‌రించుకుంది.

తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నా రు. శుక్రవారం మిథిలా ప్రాంగణంలో సీతారామచంద్ర స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరుగనుంది. సీతారాముల కల్యాణ మహోత్సవానికి భద్రాచలంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, అర్చకులు మిథిలా స్టేడియంలో కల్యాణ వేదిక సిద్ధం చేశారు.

ఇక‌.. రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు దేశం నలుమూలలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాద్రికి చేరుకున్నారు. వేదిక అయిన మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పా ట్లు చేశారు.

- Advertisement -

కల్యాణ మహోత్సవం జరిగిన మర్నాడు రామయ్యకు మహాపట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. దీనిలో భాగంగా శుక్రవారం పన్నెండేండ్లకు ఒకసారి నిర్వహించే పుష్కర మహాపట్టాభిషేకం జరుగనున్నది. సీతారామ కల్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్‌ రూ.కోటి ప్రత్యేక నిధులు కేటాయించారు. ఈ నిధులతో ఆలయ అధికారులు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ ఆదేశాల మేరకు ఎస్పీ వినీత్‌ ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, 6 వేల మంది సిబ్బందితో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement