కొమరవెళ్లి మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని పెద్దపట్నం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వరుసగా మూడురోజులు సెలవు దినాలు రావడంతో భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. దీంతో ఆలయ ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మారుమోగుతుంది.
స్వామివారికి అభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. పట్నాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. మహామండపంలో స్వామివారికి కల్యాణం నిర్వహించి ఓడిబియ్యం పోసి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి శ్రీఘ్ర దర్శనానికి 2 గంటలు, ధర్మ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నీ సౌకర్యాలు కల్పించారు ఆలయ అధికారులు.