మెదక్ లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు సోమవారం సంగారెడ్డిలో మార్నింగ్ వాక్ చేశారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ బ్యాక్ సైడ్ పార్క్, తార ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ కు చేరుకున్న నీలం మధు తెలంగాణ ఇండస్ట్రియల్ చైర్మన్, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డితో కలిసి వాకర్లు, సీనియర్ సిటిజెన్లు, రిటైర్డ్ ఎంప్లాయిస్, యువతను కలిసి పలకరించారు. వారితో కలిసి ఆయన వాకింగ్ చేశారు. షటిల్, క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. యోగ నిర్వాహకులతో కలిసి కాసేపు యోగా చేశారు. ఈ సందర్భంగా వాకింగ్ ట్రాక్ లు, ఇండోర్ ప్లేగ్రౌండ్స్ అవసరం చాలా ఉందని నీలం మధుకు వారంతా ఎంపీ అభ్యర్థి నీలం మదుకు విన్నవించారు.
కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి..
వాకింగ్ ట్రాక్ లు, ఇండోర్ ప్లేగ్రౌండ్స్
ఏర్పాటుకు కృషి చేస్తా..
కాంగ్రెస్ పార్టీ హయాంలోని సంగారెడ్డి ప్రాంతం అభివృద్ధి జరిగిందని తనను కలిసిన వాకర్లు చెబుతున్నారని నీలం మధు తెలిపారు. వాస్తవానికి దేశం మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ హయాంలోనే బీడీఎల్బీహెచ్ఎల్ ఈక్రిసాట్ వంటి గవర్నమెంట్ సెక్టార్లన్నీ మెదక్ జిల్లాలో నెలకొల్పడం జరిగిందని గుర్తు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ విప్ గా ఉన్న జగ్గారెడ్డి స్థానికంగా ఐఐటి తీసుకురావడమే కాకుండా కలెక్టరేట్ బ్యాక్ సైడ్ గ్రౌండ్ కోసం కృషి చేశారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న పాటుపడుతోందన్నారు.
దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని, రాహుల్ గాంధీ నేతృత్వంలో పాంచ్ గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. యువత ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. తాను ఎంపీగా గెలిచాక ఎంపీ, సీఎస్ఆర్ ఫండ్స్ తో వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధి, ఇండోర్ స్టేడియంలో ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అనంత కిషన్, పోతిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పెప్సీ శేఖర్, విద్యానగర్ కాలనీ అద్యక్షుడు గెల్లి వెంకటేశం, సంగారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జార్జ్, కిషన్ ఆంజనేయులు, ఉదయభస్కర్, కిరణ్ గౌడ్, లక్ష్మణ్, సంతోష్, సతీష్, యాదగిరి పాల్గొన్నారు.
సంగారెడ్డిలో..చిరు వ్యాపారులను కలిసిన నీలం మధు..
మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్ర లోని మార్కెట్లో ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఇండస్ట్రియల్ చైర్మన్, సంగారెడ్డి డిసిసి అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డితో కలసి ఉదయం మార్కెట్ కు చేరుకున్న నీలం మధు చిరు వ్యాపారులను పలకరించారు. ఈ సందర్భంగా ఆయన కూరగాయలు, పండ్లు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు వారి సాధక బాధలను నీలం మధుతో చెప్పుకున్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు వినియోగించుకుంటున్నారా ? అని నీలం మధు వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరిన్ని సంక్షేమం పథకాలు అమలుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈ ఎన్నికలలో తనను అధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జార్జ్, కిషన్ ఆంజనేయులు, ఉదయభస్కర్, కిరణ్ గౌడ్, లక్ష్మణ్, సంతోష్, సతీష్, యాదగిరి పాల్గొన్నారు.