తెరాస ప్రభుత్వంలోని సీఎం కేసీఆర్ సారథ్యంలో సబ్బండ వర్గాల అభివృద్ధి జరుగుతుందని మానుకోట అభివృద్ధి ప్రధాత, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం కేసముద్రం మండలంలోని కాట్రపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని చెరువుల్లో మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఉచితంగా అందజేసిన చేప పిల్లలను ఎమ్మెల్యే శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మత్సకారుల కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం కలగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతోనే మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వోలం చంద్రమోహన్, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు, మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు, కమిషనర్ లచ్చిరాం నాయక్, తెరాస రాష్ట్ర నాయకులు ఊకంటి యాకుబ్ రెడ్డి, వైస్ ఎంపీపీ రావుల నవీన్ రెడ్డి, సర్పంచ్ సైదమ్మ, శ్రీనివాస్, తెరాస మండల అధ్యక్షులు నజీర్ అహ్మద్, గుగులోత్ వీరు నాయక్, ఎదరబోయిన సూరయ్య, తహసీల్దార్ కోమల, పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ముదిరాజ్ కులస్తులు, మత్స్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అదేవిదంగా ఉప్పరపల్లి గ్రామంలో నిర్మిస్తున్న శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయం పనులను ఎమ్మెల్యే పరిశీలించిన అనంతరం గ్రామస్థులతో గ్రామ అభివృద్ధి పనులపై, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిదంగా కేసముద్రం మండలం టౌన్ బ్రహ్మంగారి గుడితండాలో ఇటీవలే పురుగుల మందు తాగి చనిపోయిన బానోతు గణేష్ కుటుంబానికి పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట ఎంపిపి చంద్రమోహన్, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి , మార్కెట్ చైర్మన్ నారాయణరావు, సర్పంచ్ బట్టు శ్రీనివాస్, ఎంపీటీసీ ఆగే మంజుల వెంకన్న, మండల తెరాస ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్, టౌన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ వీరునాయక్, మహేశ్వర చారి, స్థానిక వార్డ్ మెంబర్ బానోత్ పద్మా బాలు నాయక్, బద్రు నాయక్, స్థానిక ఎస్సై రమేష్ బాబు తెరాస నాయకులు, గ్రామస్థులు తదితరులున్నారు. అదేవిదంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేసముద్రం మండలం దన్నసరి గ్రామనికి చెందిన వేం ప్రతాప్ రెడ్డికి సీఎం సహాయ నిధి (40,000) చెక్కుని శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ అందజేశారు.ఈ కార్యక్రమంలో దన్నసరి సింగిల్ విండో డైరెక్టర్ కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి, మంకు యాకుబ్ రెడ్డి, లచ్చిరాం, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్ సారథ్యంలో సబ్బండ వర్గాల అభివృద్ధి : ఎమ్మెల్యే శంకర్ నాయక్
Advertisement
తాజా వార్తలు
Advertisement