Tuesday, November 26, 2024

కేసీఆర్ నాయకత్వంలో 33జిల్లాల్లో అభివృద్ధి … ఉప్పల శ్రీనివాస్ గుప్తా

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పరిధిలోని 33 జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హైదరాబాద్, బేగంపేటలోని కంట్రీ క్లబ్ లో వైశ్య యూత్ అసోసియేషన్-సికింద్రాబాద్ ఆధ్వర్యంలో జరిగిన 52వ ఇన్‌స్టాలేషన్ నైట్ కార్యక్రమంలో అధ్యక్షుడిగా శ్రవణ్ కుమార్ వుప్పాల, జనరల్ సెక్రటరీ గా వేణు మాధవ్ జవ్వాజీ, కోశాధికారిగా శ్రీమున్ రాచకొండ అండ్ కార్యవర్గ సభ్యుల ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా వైశ్య యూత్ అసోసియేషన్-సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు మెమంటో అందజేసి, శాలువాతో సన్మానం చేయడం జరిగింది. అనంతరం వైశ్యయూత్ అసోసియేషన్ -సికింద్రాబాద్ అండ్ వారి టీమ్ సభ్యులు-2023 సంవత్సరానికి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా… ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో ఇంకా తెలంగాణ టూరిజం, రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ టూరిజంను ఒక హబ్ లాగా తీర్చిదిద్దున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇచ్చి కరెంట్ కోతలు లేకుండా చేశారన్నారు. పరిశ్రమ లాల్ పవర్ హాలిడేస్ లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో వ్యాపారులందరూ ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల కాలంలో ఆర్యవైశ్యులను గుర్తించి, వారికి ప్రాముఖ్యత ఇచ్చి న్యాయం చేసింది సీఎం కేసీఆర్ ఒక్కరు మాత్రమేనన్నారు. అన్ని కులాలు, మతాల వారితో సత్సంబంధాలు కలిగి ఉండే అవకాశం ఒక్క ఆర్యవైశ్య కులానికి మాత్రమే ఉంటుందన్నారు. రైస్ మిల్లులు, కిరాణం, తదితర వ్యాపారాలు, పరిశ్రమలు, పలు రకాల వ్యాపారం చేయడంలో ఆర్యవైశ్య సోదరులు ముందుంటారన్నారు. కరోన సమయంలో కూడా బయటకు వచ్చి పేదలకు సాయం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో.. ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్ వుప్పాల, వీవైఏఎస్ మాజీ అధ్యక్షులు ఉప్పల రాజేశ్వర్, ప్రెసిడెంట్ మదన్ మోహన్ వేము, సెక్రటరీ సంపత్ చీకోటి, కోశాధికారి శ్రవణ్ కుమార్ వుప్పాల, జనరల్ సెక్రటరీ వేణు మాధవ్ జవ్వాజీ, కోశాధికారి శ్రీమున్ రాచకొండ జాయింట్ ట్రెసరర్, డైరెక్టర్స్, ఛైర్మెన్స్, అడ్వైజర్స్, అండ్ కార్యవర్గ సభ్యులు ఆర్యవైశ్య ప్రముఖులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement