Saturday, November 23, 2024

TS | అభివృద్ధి, ఆహ్లాదం, అధ్యాత్మికం, ఆరోగ్యం.. అదే మా నినాదం: మంత్రి గంగుల

కరీంనగర్ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని.. తనపై నమ్మకంతో మూడుసార్లు గెలిపించిన నగర ప్రజలకు రుణపడి ఉంటానని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గణేష్ నగర్ బైపాస్ రోడ్డు, అంబేద్కర్ స్టేడియంలో వాకింగ్ ట్రాక్, లైటింగ్ సిస్టంను నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసి ఆయ‌న ఇవ్వాల (గురువారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. భావితరానికి గొప్ప నగరాన్ని అందించాలనే లక్ష్యంతో నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని.. అభివృద్ధి ఆహ్లాదం ఆధ్యాత్మికం ఆరోగ్యం అనే నినాదాలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.

సమైక్య పాలనలో కరీంనగర్ అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని.. నిధులు అడుగుతే గత పాలకులు వెహికల్ గా నవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు.. లో అద్భుత ప్రగతి కొనసాగుతుందని.. ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.. మరో ఆరు నెలల్లో అద్భుత నగరంగా కరీంనగర్ను తీర్చిదిద్దామని అన్నారు..తాను రానున్న ఎన్నికల కోసం పనిచేయడం లేదని -బావి తరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాని పునరుద్ఘాటించారు.. నగరాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తున్నానని అన్నారు… నగరంలో ప్రధాన రహదారులతో పాటు లింక్ రోడ్లను . నగర కూడళ్లను అద్భుతంగా నిర్మించామని వెల్లడించారు..

దానిలో భాగంగా గణేష్ నగర్ బైపాస్ రాజా టాకీస్ రోడ్ శాతవాహన యూనివర్సిటీ రోడ్లను అభివృద్ధి చేశామని అన్నారు.. కరీంనగర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు.. గతంలో వర్షాకాలం వస్తే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంఅవుతుందేవని.. నగరాన్ని ముందుచూపుతో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.. కరీంనగర్ అభివృద్ధికి మరో 132 కోట్లు మంజూరయ్యాయని టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని మిగిలి ఉన్న రోడ్లను త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కలెక్టర్ బి గోపి , జాయింట్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్.., డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి, డివిజన్ కార్పొరేటర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement