నిజామాబాద్ సిటీ, నవంబర్ 13(ప్రభన్యూస్)
నిజామాబాద్ అర్బన్ లో అభివృద్ధి జరగలేదంటూ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అర్బన్ ఎమ్మె ల్యే , బిఆర్ ఎస్ అర్బన్ అభ్యర్థి గణేష్ బిగాల అన్నారు. సోమవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల బి.ఆ ర్.ఎస్ పార్టీ జిల్లా కార్యలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగరాభివృద్ధికి అన్ని విధాలుగా కృషిచేశానని.. దిగజారుడు రాజకీయాలు చేయొద్దని అన్నారు.మీకు చేతనైతే అభివృద్ధి చేయం డి.ఐటి హాబ్ తీసకవచ్చి ఉద్యోగాలు ఇవ్వండి…మినీ ట్యాంక్ బండ్ కట్టండి…. ఇంకా ఏదైనా అభివృద్ధి చేయండి కానీ అవగాహన రాహిత్యం తో విమర్శలు చేయ కూడదనీ అర్బన్ ఎమ్మెల్యే, బిఆర్ ఎస్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు.
ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రజల ఆశీర్వాదం తో 4వ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు.2009 లోఎంపి. గా 2014, 2018, 2023 లో ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నాననీ అన్నారు.నాలుగు సార్లు ఆరోగ్యకరమైన రాజకీ యాలు చేసాను తప్ప నేను చేసిన అభివృద్ధి గురించి చెప్పానని, తప్ప ప్రతి పక్ష పార్టీ నాయ కుల పేరు కూడా నేను తీయ లేదన్నారు. గత కొద్ది రోజుల నుండి అభివృద్ధి పై చర్చకు సిద్ధమా అని ప్రతి రోజు సవాల్ చేస్తే నేను కూడా సిద్ధం అని చెప్పానని అన్నారు.ఆయన చర్చ మిని ట్యాంక్ బండ్ దగ్గర, వైకుంఠదామం దగ్గర లేక ఐటి హాబ్ దగ్గర పెడితే మేము చేసిన అభివృద్ధి కూడా ఆయనకు కనిపించేదన్నారు.
గుడి దగ్గర రాజకీయాలు చేయను…
గుడి దగ్గర చర్చకు రా అని సవాల్ చేశారు.నేను గుడి కట్టిం చిన… బడి కట్టించిన కానీ నేను గుడి దగ్గర రాజకీయాలు చేసే వ్యక్తిని కాదన్నారు. నిన్న రాత్రి పోలీసులు డిబేట్ లకు అను మతి లేదని శాంతి భద్రతల సమస్యలు వస్తాయని నోటీ సులు ఇచ్చారని తెలిపారు. నిజామాబాద్ నగరం శాంతి యుతంగా ఉండటమే నా మొదటి కర్తవ్యం పోలీసుల సూచన మేరకు డిబేట్ ని రద్దు చేసి ప్రెస్ మీట్ కి వచ్చామన్నారు. 2014 ,2018 ఎన్నికలలో మేము చేసి అభివృద్ధి పనుల డిజైన్ లను కరపత్రాల్లో వేస్తే అవి రంగుల బొమ్మలు అని హేళన చేశారనీ మండిపడ్డారు. ప్రస్తుతం అవి నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలందరి కి అందుబాటులో వచ్చాయని గుర్తు చేశా రు. మేము చేసిన అభివృద్ధి మా ఎన్నికల కరపత్రాలలో ఉందన్నారు.
ప్రజలే బాస్…
ప్రజలకు జవాబుదారిగా ఉంటాను.నన్ను గెలిపించింది వారే ప్రజలే నా బాస్ అన్నారు.నిజామాబాద్ నగరం లో హైద రాబాద్ తరహాలో మినీ ట్యాంక్ బండ్ నిర్మించామన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఎక్కడ లేని విధంగా మున్సిపల్ భవ నాన్ని నిర్మించామనీ, హైద రాబాద్ మహా ప్రస్థానం కంటే ధీటుగా వైకుంఠదామలు నిర్మించామన్నారు.మరోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే 24 గం.లు మంచి నీరు ఇస్తామ న్నారు .ప్రతి ఇంటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజి కనెక్షన్లు ఉచితం గా ఇస్తామన్నారు. గతంలో కుల మతాల మద్య చిచ్చు పెట్టి తప్పుడు ఆరోపణలు చేసి మున్సిపల్ ఎన్నికల్లో గెల వాల ని చూసారు. కానీ రెండు సార్లు మున్సిపల్ కార్పోరేషన్ లో రెండు సార్లు గులాబీ జెండా ఎగురవేశామన్నారు. మరొక సారి కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తు న్నారు. ప్రజలందరూ అప్రమ త్తంగా ఉండి తగిన విదంగా బుద్ధి చెప్పాలన్నారు.రాష్ట్రం లో ఒక పార్టీ నిజామాబాద్ నగరం వేరే పార్టీ ఎమ్మెల్యే ఉంటే గతం లో నిజామాబాద్ నగరం అభి వృద్ధి జరగలేదని మీరు ఒక సారి గుర్తు చేసుకో వాలన్నారు. నిజామాబాద్ నగరం మరింత అభివృద్ధి కోసం, సంక్షేమం కొనసాగింపు కోసం మరొకసారి కారు గుర్తుకి ఓటు వేసి బి.ఆ ర్.ఎస్ పార్టీ ని గెలిపిం చాలని ప్రజలందరికీ కోరారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ , మాజీ మేయర్ ఆకుల సుజాత ,నుడ మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ,బి.ఆర్.ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్,సూదం రవి చందర్, సత్య ప్రకాష్,సిర్ప రాజు,యెనుగందుల మురళి,ధర్మపురి,అక్బర్ హుస్సేన్, రాజేంద్రప్రసాద్,అంబాదాస్,మాదని శ్రీధర్,RL నర్సింహ, గోపరి లక్ష్మణ్,కొవూరి జగన్,గంగమని,కరిపే రాజు,భారీ తదితరులు పాల్గొన్నారు.