Wednesday, November 20, 2024

ADB: ఆలయానికి చేరుకున్న మెస్రం వంశస్థులు.. నాగోబా సన్నిధిలో భక్తుల కిటకిట

ప్రభ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఫిబ్రవరి 9: రాష్ట్ర పండుగగా గుర్తించే కెస్లాపూర్ నాగోబా జాతరకు వివిధ రాష్ట్రాల నుండి ఆదివాసులు తరలివస్తూ తమ ఇలవేల్పు మహా పూజలతో తరించిపోతున్నారు. తెలంగాణతో పాటు చత్తిస్ ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుండి మెస్రం వంశస్థులు శుక్రవారం నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ఆదివాసుల సాంప్రదాయ వాయిద్యాలైన డోలు, పేప్రే, కాళీకొమ్ లు వాయిస్తూ ఆలయ ప్రాంగణంలోకి చేరుకోగా ఇక్కడి ఆదివాసి పూజారులు స్వాగతించి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

ఈరోజు సాయంత్రం 90 కిలోమీటర్ల దూరం నుండి కాలినడకన ఆదివాసి భక్తులు తీసుకువచ్చిన పవిత్ర గంగా జలాలతో ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం నాగోబాకు గంగా జలాభిషేకం నిర్వహించి మహా పూజకు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎస్పీ, ఐటీడీఏ పీవో సమక్షంలో మిశ్రమ వంశస్థులు మహా పూజకు శ్రీకారం చుట్టనున్నారు. జాతర ఉత్సవాల్లో భాగంగా ఈనెల 12న అధికారికంగా కస్లాపూర్లో దర్బార్ నిర్వహించడం జరుగుతుందని ఆలయ పూజారులు తెలిపారు. జాతర ఉత్సవాల ప్రారంభంతో వేలాదిగా జనం తరలివస్తుండడంతో కెస్లాపూర్ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. జాతర ఉత్సవాలకు 620 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement