వైరా, మార్చి 8(ప్రభ న్యూస్): ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. స్నానాల లక్ష్మీపురంలో నాలుగు రోజులపాటు నిర్వహించే ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆదేశించారు. అనంతరం ఆలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నందిని దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రజలకు, ప్రయాణికులకు, వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి లక్ష్మీపురానికి ప్రజల పోటెత్తారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వైరా గండుగల పాడు సమీపంలో శిరిడి సాయి మందిరం సమీపం నుంచి నేరుగా లక్ష్మీపురం దేవాలయం వరకు ఒక్క రోజులోనే రోడ్డు వేయడంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మార్కు సంతరించుకుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ అభివృద్ధికి నిధులు కూడా కేటాయించడంతో రానున్న రోజుల్లో ఉత్సవాలు మరింత ఘనంగా జరిగే అవకాశాలున్నాయి. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు ఉన్నారు.