Tuesday, November 19, 2024

MBNR: రేపు మ‌క్త‌ల్ లో డిప్యూటీ సీఎం భ‌ట్టి, మంత్రి ఉత్త‌మ్ ప‌ర్య‌ట‌న…

మక్తల్, మార్చి12 (ప్రభన్యూస్) : భీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన సంగంబండ రిజర్వాయర్ కింద లో లెవెల్ లెఫ్ట్ కెనాల్ బండరాయి తొలగించే పనులను ప్రారంభించేందుకు బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మక్తల్ రానున్నారు. సంగంబండ రిజర్వాయర్ వద్ద బండ తొలగింపుతో పాటు పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన హరిత హోటల్ ఏర్పాటు, బోటింగ్ తదితర ఏర్పాట్లపై పరిశీలించి ముంపు బాధితులతో మంత్రులు మాట్లాడనున్నారు.


ఇందుకోసం హైదరాబాద్ నుండి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డిలు హెలికాప్టర్ లో నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ గ్రామానికి చేరుకోనున్నారు. సంగంబండ వద్ద ఇవాళ హెలిపాడ్, మక్తల్ ప్రజాదీవన సభ జరగనున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ యోగేష్ గౌతం, స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట డీఎస్పీ లింగయ్య, సీఐ చంద్రశేఖర్, ఎస్సై భాగ్య లక్ష్మి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి, జి.గోపాల్ రెడ్డి, జి.లక్ష్మారెడ్డి, బోయ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement