Monday, November 25, 2024

People’s March – తొలి అడుగు నేల‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి అభివృద్ధి బాట‌లు…

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ : నిద్రాణ స్థితిలోని జాతిని తట్టిలేపిన భట్టి విక్రమార్కుడు తొలి అడుగుకు వేదికైన నేల ఇది.. పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు నాంది ప్రస్తావన చేసిన మట్టి ఇది.. ఇందిరమ్మ రాజ్య స్థాపనకై భట్టి చేపట్టిన అకుంఠిత లక్ష్య సాధనను జయోత్సవగీతిగా ఆశీర్వదించిన ప్రాంతమిది.. పదేళ్ల కేసీఆర్ పాలనలో బతుకు భారమై, జీవితం మీద ఆశలేక.. బతికేందుకు పనుల్లేక నిస్త్రాణ‌గా మారిన జీవితాలకు భరోసా ఇచ్చేందుకు, ఆగమవుతున్న బతుకులకు కొత్త ధైర్యం చెప్పేందుకు సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు తొలి అడుగు పడింది ఇక్కడే.

మార్చి 16, 2023న ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర మండలం పిప్రి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అత్యంత సుదీర్ఘంగా సాగిన నాటి పాదయాత్రలో 16 జిల్లాలు, 37 నియోజకవర్గాల్లో, సుమారు 700 గ్రామాల్లో భట్టి విక్రమార్క తన పాదముద్రలను స్పష్టంగా వేశారు.

వేలాది మంది ప్రజలను ప్రత్యక్షంగా కలిశారు. వారి కష్టసుఖాలను.. ఈతిబాధలను, ఛిద్రమవుతున్న జీవితాలను నేరుగా చూశారు. వారి సమస్యలు కడతేర్చేందుకు ఇందిరమ్మ రాజ్యంలో అహరహరం శ్రమిస్తున్నారు. అందులో భాగంగా మహా పాదయాత్రకు తొలి అడుగుకు వేదికైన పిప్రి గ్రామాభివృద్ధికి బాటలే వేసేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కహోదాలో రేపు ఆ గ్రామానికి వెళుతున్నారు. పాద‌యాత్ర‌కు స్పూర్తి నింపిన గ్రామంలో పలు అభివృద్ది ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు, శ్రీకారాలు చుట్ట‌నున్నారు.. ఉప ముఖ్య‌మంత్రి హోదాలో గ్రామానికి రానున్న ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు ప్ర‌జ‌లు ఏర్పాట్లు చేస్తున్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement