ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పుట్టిన రోజు నేడు… ఈసందర్భంగా పలువురు ఆయనకు జన్మదిన శుభకాంక్షలు తెలిపారు.. అలాగే ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్ తెలిపారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను, ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఈ ట్వీట్‌కు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా భట్టితో నవ్వుతూ దిగిన ప్రత్యేకమైన ఫొటోను సీఎం జత చేశారు.
ప్రజా భవన్ లో
ఈ సందర్బంగా ప్రజా భవన్ లో ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ప్రజా భవన్ లోని పోచమ్మ తల్లి దేవాలయం దగ్గర కుటుంబ సభ్యులతో కలిసి డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి వి ను యాదగిరిగుట్ట వేద పండితులు, హైదరాబాదులోని ప్రముఖ దేవాలయాల ఆలయ అర్చకులు ఆశీర్వదించారు.
గజమాలతో సత్కారం..
కాగా, ప్రజా భవాన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు భారీ గజమాలతో పార్టీ శ్రేణులు, అభిమానులు సత్కరించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో 50 కిలోల కేకును డిప్యూటీ సీఎం కట్ చేశారు. పార్టీ శ్రేణులు అభిమానుల రాకతో ప్రజాభవన్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసి పోయాయి. భట్టి విక్రమార్కకు ప్రభుత్వ విప్ బీర్ల ఐయిలయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నగేష్, ఐఏఎస్ అధికారులు హనుమంతరావు, సుశీల్ శర్మ, అడిషనల్ డీజీ సునీల్ కుమార్, అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.