Tuesday, November 26, 2024

Khammam: డెంగ్యూ డెంజర్ బెల్స్… డెంగ్యూతో ముగ్గురు మృతి

మణుగూరు, అగస్టు 31(ప్రభ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే పలువురు డెంగ్యూ జ్వరంతో మృత్యువాత పడ్డారు. డెంగ్యూ జ్వరంతో వరుస ఘటనలు జరుగుతున్నా వైద్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పినపాక నియోజకవర్గంలో పినపాక, కరకగూడం, బూర్గంపాడులో వరుసగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. పినపాక మండలంలోని ఉప్పాక గ్రామానికి చెందిన తోలెం నాగమణి (28) గత మూడు రోజులు నుండి జ్వరం రావడంతో మణుగూరు ఏరియా అసుపత్రిలో వైద్య చికిత్సలు జరుతుండగానే బుధవారం పరిస్థితి విషమించడంతో ఏరియా అసుపత్రి వైద్యులు భద్రాచలం ఏరియా అసుపత్రికి తరలించారు. భద్రాచలం ఏరియా అసుపత్రిలో చికిత్సా జరుగుతుండగానే మృతి చెందింది.

  • కరకగూడెం మండలానికి చెందిన తిప్పాని స్పందన(16) కోత్తగూడెంలోని క్రిష్ణవేణి కాలేజిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. గత నాలుగు రోజులు నుండి జ్వరంతో భాదపడుతుంది. బుధవారం పరిస్థితి విషమించడంతో మణుగూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. డెంగ్యూ జ్వరం గుండె మీద ప్రభావం చూపడంతో తుదిశ్వాస విడిచింది. అలాగే బూర్గంపాడు మండలానికి చెందిన ఏడాకుల పద్మ(37), డెంగ్యూ జ్వరంతో మృతిచెందింది. వరుసగా పినపాక నియోజకవర్గంలో మూడు మండలాల్లో వరుసగా డెంగ్యూ జ్వరంతో మృతి చెందారు. వైద్యులు మాత్రం ఎక్కడ కూడా డెంగ్యూ కేసులు లేవని సమాధానం చెప్తున్నారు. కేవలం మండల వైద్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఎంతోమంది డెంగ్యూ జ్వరాలతో ప్రైవేటు, ఏరియా ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. మరణాలకు అడ్డుకట్ట వేయకుంటే ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Advertisement

తాజా వార్తలు

Advertisement