హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదల ఇళ్లపైకి కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లు పంపుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
మీరు చెప్పినట్లుగా, ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అమానవీయం, అన్యాయం అని మల్లికార్జున్ ఖర్గేను ఉద్దేశించి కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పేదల ఇళ్లపైకి కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్‌లు పంపుతుంది. రాష్ట్రం బుల్డోజర్ రాజ్యంగా మారకుండా సీఎంకు ఖర్గే సలహా ఇవ్వాలి. నోటీసులు ఇవ్వకుండా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 75 ఇండ్లను కూల్చేశారు. ఈ 75 కుటుంబాల్లో దాదాపు 25 కుటుంబాలు వికలాంగులకు చెందినవి. రాష్ట్రంలో చట్టం, న్యాయ వ్యవస్థ పట్ల ధిక్కారం జరుగుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.