Friday, November 22, 2024

Demolished – మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేత‌

ఎటువంటి నోటీస్ లు లేకుండా నేట‌మ‌ట్టం
తెల్ల‌వార‌క ముందే బుల్ డోజ‌ర్ల‌తో సిబ్బంది ప్ర‌త్యక్ష్యం
తేరుకునే లోపే 75 ఇళ్లు ధ్వంసం
గ‌గ్గోలు పెడుతున్న ప్ర‌జ‌లు
ప‌ట్టాలున్నా ఈ కూల్చివేత‌లు ఏమిటి అంటూ రోధ‌న‌లు

మహబూబ్‌నగర్‌: రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం కానసాగుతున్నది. హైదరాబాద్‌లో హైడ్రా తరహాలో పాలమూరులో కూడా అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ అధికారులు ఆదర్శనగర్‌లోని పేదల ఇండ్లను గురువారం తెల్లవారుజామున కూల్చివేశారు. భారీ బందోబస్తుతో రాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో హఠాత్తుగా బుల్డోజర్లతో వచ్చిన అధికారులు.. పేదలు నిద్రిస్తుండగానే బయట నుంచి గోడలను నేలమట్టం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తుండగానే సుమారు 75 ఇండ్లను కూల్చివేశారు.

- Advertisement -

గతంలో ప్రభుత్వం తమకు పట్టాలి ఇచ్చిందని చెబుతున్నప్పటికీ వినకుండా అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేతలకు పాల్పడ్డారు. దీంతో పేదలు లబోదిబోమంటున్నారు. కాంగ్రెస్ హయాంలోని పట్టాలు ఇచ్చి ఇప్పుడు అదే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూల్చివేయడం ఏంటని నిలదీశారు. తమకు నిలువనీడ లేకుండా చేశారంటూ బాధితులు కంటతడి పెడుతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న పెద్దలను వదిలేసి తమపై ఎందుకు కక్షగడుతున్నారని శాపనార్థాలు పెడుతున్నారు. కనీసం పునరావాసం కల్పించాలని కోరుతున్నారు. దీంతో పట్టణంలో పేదల ఇండ్లు కూల్చి వేయడం చర్చనీయాంశంగా మారింది. పక్కనే పెద్ద మనుషులు పార్టీల నాయకులు వాళ్ల అనుచరులు కట్టిన ఇళ్లను మాత్రం అధికారులు కూలగోట్టకపోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement