అడ్డుకున్న స్థానికులు
అధికారులతో వాగ్వాదం
వెనక్కి తగ్గని హైడ్రా
ఏకరం స్థలంలో ఉన్న గృహాలు కూల్చివేత
ఆ వెంటనే స్థలం స్వాధీనం..
హైదరాబాద్: రాయదుర్గంలో నేడు హైడ్రా సిబ్బంది అక్రమణలు తొలగింపు చర్యలు చేపట్టారు. మున్సిపల్ సిబ్బంది,
హైడ్రా సిబ్బంది పోలీసుల తో కలసి అక్కడికి నేటి ఉదయం వెళ్లారు.. బుల్ డోజర్లతో వెళ్లిన సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు.. ఎంతోకాలంగా నివాసాలు నిర్మించుకుని ఉంటున్న తమను ఎలా పంపుతారని అధికారులతో వాగ్వాదానికి దిగారు.నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారంటూ అధికారులపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఇంట్లో ఉన్న వారిని బయటకు పంపి వేశారు .. అనంతరం ఇక్కడ గృహాలను కూల్చివేశారు. ఏకరం స్థలంలో అక్రమణలు కూల్చివేసిన ఆ భూమిని స్వాధీనం చేసుకుని అక్కడ ప్రభుత్వ బోర్డును ఏర్పాటు చేశారు.
- Advertisement -