హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల కూల్చివేతలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను నేడు లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పాలసీ ఉంటే పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ ప్రశ్నించారు. అధికారులు చేసే పనులతో తాము ప్రజల మధ్య తిరుగలేకపోతున్నామని చెప్పారు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల కూల్చివేతను పాతబస్తీ నుంచి ప్రారంభించాలన్నారు. మాదాపూర్‌లో కుమారీ అంటీకి ఇచ్చిన మినహాయింపును అధికారులు పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
- Advertisement -