హైదరాబాద్ – మరోసారి ‘హైడ్రా’ బుల్డోజర్ కూల్చివేతలు మొదలయ్యాయి. హైదరాబాద్ రామ్ నగర్ లోని మల్లెమ్మ గల్లీలో అక్రమ కూల్చి వేతలు చేస్తున్నారు హైడ్రా అధికారులు.
హైదరాబాద్‌లోని అడిక్‌మెట్ డివిజన్ రాంనగర్‌లో ‘హైడ్రా’ కూల్చివేతలు చేపట్టింది. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.
- Advertisement -
ఈ అక్రమ నిర్మాణాలపై రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్కు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీ రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమే అని నిర్ధారించిన అనంతరం హైడ్రా అధికారులు శుక్రవారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
.
.