Tuesday, November 26, 2024

Demand – మాట నిలుపుకున్నాం .. సిగ్గు,శ‌రం ఉంటే రాజీనామా చేయ్ ..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – వైరా – ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతుల‌కు నేడు రెండు లక్షల రుణమాఫీ చేశామని అంటూ చీము నెత్తురు, సిగ్గు శరం ఉంటే హరీశ్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. వైరాలో జ‌రిగిన ఒక కార్య‌క్రమంలో రేవంత్ మూడో విడ‌త రుణ మాఫీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు..

రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని చెప్పారు. రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం 2లక్షల రుణమాఫీ చేశామన్నారు రేవంత్. ఇవాళ ఒక రోజే 18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తం రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. 140 కోట్ల మంది స్వేచ్చావాయువులు పీల్చే విధంగా కాంగ్రెస్ స్వాతంత్ర్యం తెచ్చిందన్నారు.మూడు విడుతల్లో 31 వేల కోట్లతో రైతులకు రుణ విముక్తి చేశామన్నారు రేవంత్.

- Advertisement -

దీంతో తామ ఇచ్చిన మాట ప్ర‌కారం ఆగ‌స్ట్ 15 లోగా రైతుల రుణ‌మాఫీని సంపూర్ణంగా చేశామ‌ని అన్నారు. దీంతో అసెంబ్లీ స‌వాల్ చేసిన విధంగా హరీశ్ రాజీనామా చేస్తే సిద్దిపేటకు పట్టిన పీడ విరగడ అవుతుందని ధ్వజమెత్తారు. ఒకవేళ రాజీనామా చెయ్యకపోతే అమరుల స్థూపం దగ్గర హరీష్ ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లా రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టిందన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ అంటుండు..ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నా వచ్చినా కేటీఆర్, కేసీఆర్ కు బుద్ధి రావడం లేదన్నారు. ప్రజలే తప్పు చేశారన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ బతుకు బస్టాండ్ అయ్యిందని ధ్వజమెత్తారు. ఖమ్మం గడ్డ ..కాంగ్రెస్ అడ్డా అని రేవంత్ రెడ్డి అన్నారు. 8 నెలల్లోపే రూ.2 లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నామన్నారు. కాగా, 2026 కల్లా సీతారామ పూర్తి చేస్తామ‌ని, ఎన్ని నిధులు అవసరమైనా తెస్తామన్నారు రేవంత్.

Advertisement

తాజా వార్తలు

Advertisement