Friday, November 22, 2024

చ‌ల్ల చ‌ల్ల‌గా.. తియ్య తియ్య‌గా.. చెరుకురసం తయారీలో కొత్త విధానాలు

ప్రభన్యూస్ : ఒకప్పుడు చెరుకురసం తయారీ అంటే కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి చెరుకు రసాన్ని విక్రయిస్తారు అనే సాంప్రదాయం ఉండేది. కానీ పెరుగుతున్న నిరుద్యోగ సమస్యతో పాటు- దీనిపై ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతుండడంతో వేసవిలో విద్యావంతులు సైతం వాటిపై ఆధారపడి జీవిస్తున్నారు. అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆధునిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఆధునిక యంత్రాలతో పాటు- ప్రాచీన యంత్రాల ద్వారా చెరుకురసాన్ని తయారు చేస్తూ నగరం, నగర శివారు ప్రాంతాల్లో చెరుకు రసం ప్రియులను ఆకట్టు-కుంటు-న్నారు. వేసవి వచ్చిందంటే వీటికి భలే క్రేజీ.

చెరుకురసం ఆరోగ్యదాయిని..

చెరుకురసం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే చల్ల చల్లగా తీయ్య తీయగా ఉండే చెరుకురసం అంటే పెద్దలతో పాటు- పిల్లలకు బహు ప్రియం. దీనిలోని ఔషధ గుణాల వలన అనారోగ్య సమస్యలు సైతం అధిగమించవచ్చు. అందుకే చెరుకురసాన్ని ప్రతిఒక్కరు ఇష్టంగా తాగుతారు. వేసవిలో చెరుకురసం సేవించడం వలన అలసట దరిచేరదు. వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. వేసవిలో ఇది అత్యంత ఆరోగ్యకరం. మధుమెహ వ్యాధిగ్రస్తులు సాధారణంగా దీన్ని సేవించడానికి ఇష్టపడరు కాని చెరుకు రసంలో తక్కువ మోతాదులో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉండడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా దీన్ని సేవించి వచ్చు అని వైద్యుల సూచన. చెరుకురసంలో సహజ సిద్ధమైన లక్షేటీ-వ్‌ గుణాలు ఉండడం వలన కడుపులో మంట, ఎసీడీటీ- ని నియంత్రిస్తుంది. క్యాల్షియం వలన ఎముకలు,దంతాలు రక్షణకు మంచిది ఇలా అనేక రకాల ఉపయోగం వలన వేసవిలోనే కాక ఇతర సమయాలలో సైతం ఇది అందరికీ అత్యంత ప్రియం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement