Tuesday, November 26, 2024

అంబులెన్స్ లోనే పండంటి మ‌గ‌బిడ్డ ప్ర‌స‌వం..

ఖానాపూర్ రూరల్, సెప్టెంబర్ 07, (ప్రభ న్యూస్): గర్భిణీ అంబులెన్స్ 108 లో ప్రసవించిన సంఘటన మండలంలోని బీర్నంది గ్రామపంచాయతీ పరిధి కొమ్ముతండలో చోటుచేసుకుంది. పి అరుణకు గురువారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు 108 కు సమాచారం అందించగా . అంబులెన్స్ సిబ్బంది ఆమెను నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా ఇక్బాల్ పూర్ గ్రామ సమీపంలో పురిటి నొప్పులు అధికమ‌య్యాయి. దీంతో అంబులెన్స్ లో మగ బిడ్డకు జన్మనిచ్చింది.

తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఈఎంటి. భోజన్న పైలెట్. నయీములా ఖాన్ తెలిపారు. అనంతరం తల్లి బిడ్డను నిర్మల్ ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్ కు తరలించారు. కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement