ఫ్యాక్స్ కాన్ బృందంతో చర్చలు
కాంగ్రెస్ అథిష్టానంతో సమావేశాలు
మంత్రి వర్గ విస్తరణ, పిసిపి చీప్ పై మంతనాలు
రైతు కృతజ్ఞత సభకు సోనియాకు ఆహ్వానం
ఆంధప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ ఫాక్స్ కాన్ ఛైర్మన్ ఢిల్లీలో ఉండటంతో ఆయనను రేపు రేవంత్ కలువనున్నారు.. తెలంగాణలో ఆ కంపెనీ ఏర్పాట్లపై ఆయనతో చర్చలు జరపనున్నట్లు సమాచారం… అనంతరం పార్టీ హైకమాండ్ తో సమావేశమవుతారు. టీపీసీసీ నూతన చీఫ్ ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణపై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలతో చర్చిస్తారు. దీంతోపాటు వరంగల్ లో జరగనున్న రైతు కృతజ్ఞత సభకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు.