Friday, November 22, 2024

Delhi Tour – నేడు హ‌స్తిన‌కు రేవంత్ – మూడు రోజులు అక్క‌డే…

అంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు నేడు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలకు పరిష్కారం కోసం కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిల విడుదలపై సంబంధిత మంత్రుల‌తో ఆయ‌న చ‌ర్చించ‌నున్నారు.. రేవంత్ తో పాటు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబుతో పాటు వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు కూడా హ‌స్తిన‌కు వెళుతున్నారు..

మూడు రోజుల ఢిల్లీ టూర్‌లో పలువురు కేంద్ర మంత్రులను కలవడంతో పాటు రాష్ట్రానికి రానున్న బడ్జెట్‌లో నిధుల కేటాయింపు పెంచాల్సిందిగా కోరనున్నారు. ఈ నెల 23న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో కేంద్ర గ్రాంట్లను పెంచాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి చర్చించనున్నారు.

- Advertisement -

ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ సీఎంతో జరిగిన సమావేశంలో జరిగిన చర్చల వివరాలను కేంద్ర హోం మంత్రికి వివరించి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాల్సిన అంశాలపై తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరే అవకాశముంది. డిఫెన్స్ లాండ్స్ కేటాయింపు మొదలు సైనిక్ స్కూలు ఏర్పాటు వరకు అనేక అంశాలను ఈ పర్యటన సందర్భంగా కేంద్ర పెద్దలతో చర్చించనున్నారు.

సోనియా, రాహుల్‌తో సమావేశాలు

రాష్ట్రంలో రుణమాఫీ స్కీమ్‌ అమలవుతున్న విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించనున్నారు. పథకం అమలుకు అవసరమవుతున్న మొత్తం రూ. 31 వేల కోట్లలో ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కోసం విడుదల చేసిన రూ. 6,098 కోట్ల గురించి ఆమెకు వివరించనున్నారు. ఈ నెల చివర్లో వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించనున్న విజయోత్సవ సభకు రావాల్సిందిగా రాహుల్‌గాంధీని ఆహ్వానించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement