హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవం రేపు జరగనున్న నేపద్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ నేతలు కూడా హస్తినకు వెళ్లారు.
ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం అనంతరం సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఏఐసీసీ నేతలను కలిసే అవకాశముంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించే అవకాశం ఉన్నట్టు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది.
16 న సింగపూర్ కు పయనం
- Advertisement -
సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బృందం 16న ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్తారు. ఈనెల 19 వరకు సింగపూర్‌లో పర్యటించి.. స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందాలు.. పారిశ్రామిక పెట్టుబడులపై సీఎం బృందం చర్చించనుంది. ఈనెల 20 నుంచి 22 వరకు దావోస్‌లో పర్యటించనున్నారు.