Friday, November 22, 2024

Delhi – రైల్వే మంత్రి అశ్విన్ తో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి భేటి..

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఢిల్లీలో భారత రైల్వే మంత్రి అశ్విని వైభవను మర్యాద పూర్వకంగా కలిశారు.. ఈ సంద‌ర్బంగా పార్లమెంట్ నియోజకవర్గం మరియు దేవరకద్ర నియోజకవర్గం కేంద్రం లో రైల్వే గేట్ సమస్య లపై రైల్వే మంత్రి తో చర్చించారు. ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ఆర్వోబి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావడంతో రైల్వే అధికారులు స్థానికంగా ఉన్న రైల్వే గేట్ మూసివేశారని దీంతో రైల్వే గేట్ అటు ఇటు రాకపోకలకు, స్థానిక ప్రజలకు , చిరు వ్యాపారులకు తీవ్రంగా ఇబ్బంది కలుగుతుందని వివరించారు.

గేట్ మూసివేయడంతో రాకపోకలు స్తంభించి మార్కెట్ కు గండి పడటమే కాకుండా చిరు వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని వివ‌రించారు.. స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అభ్యర్థన మేరకు ప్రజలు,వ్యాపారస్తులు,వాహనదారుల ఇక్కట్లు తొలగిస్తూ రైల్వే గేటు ఎప్పటి లాగే తెరిచి ఉంచాలని ఎంపీ రైల్వే మంత్రిని కోరారు.అలాగే మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఇతర సమస్యలను కూడా రైల్వే మంత్రి దృష్టికి ఎంపి మన్నే శ్రీనివాస్ రెడ్డి తీసుకెళ్లారు.. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి సానుకూలంగా స్పందింస్తూ వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement