Monday, November 25, 2024

Delhi – యునెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ క‌మిటీ సమావేశాలను ప్రారంభించిన మోడీ

యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సెషన్‌కు హాజ‌రైన మంత్రి జూప‌ల్లి

తొలిసారి భార‌త్ ఆతిథ్యం**జూలై 21 – 31 వ‌ర‌కు న్యూఢిల్లీ వేదికగా స‌మావేశాలు

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – వార‌స‌త్వ క‌ట్ట‌డాల ప‌రిర‌క్ష‌ణ ధ్యేయంగా ప‌ని చేసే యునెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ క‌మిటీ 46వ సెష‌న్ ను న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నేడు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్రారంభించారు. ఈ నెల 31 వ‌ర‌కు కొన‌సాగే ఈ స‌మావేశాల‌కు మ‌న దేశం మొదటిసారి ఆతిధ్యం ఇచ్చింది.

ఈ సమావేశం లో తెలంగాణ నుంచి ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హాజ‌ర‌య్యారు

- Advertisement -

యునెస్కో డైరెక్టర్ జనరల్ ఓద్రే అజులై, కేంద్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెక‌వ‌త్ తో పాటు 150కి పైగా దేశాల నుంచి 2 వేల‌ మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు హాజ‌ర‌య్యారు

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్ర‌సిద్ధ వార‌స‌త్వ క‌ట్ట‌డాలు, చారిత్ర‌క ప్రాంతాలు, ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌కు చెందిన క‌ళాఖండాలు, వాటి స‌మాచారాన్ని తెలిపేలా స్టాల్ ను ఏర్పాటు చేశారు.

ఆసియా దేశాల‌కు చెందిన ప‌లు స్టాల్స్ ను మంత్రి జూప‌ల్లి సంద‌ర్శించారు. నాగ‌ర్జున సాగ‌ర్ లోని బుద్ధ‌వనాన్ని అంత‌ర్జాతీయలో అభివృద్ధి చేయ‌డంతో పాటు మ‌న రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన సాంస్కృతిక, వారసత్వ ప్రాంతాల ప‌రిర‌క్ష‌ణ‌, అభివృద్ధికి చర్య‌లు తీసుకోవ‌డానికి ఇలాంటి స‌మావేశాలు ఎంతో దోహ‌ద‌ప‌డుతాయ‌ని మంత్రి ఈ సంద‌ర్భంగా తెలిపారు.

2021 లో చైనాలోని ఫ్యూజీలో జరిగిన ప్రపంచ వారసత్వ కట్టడాలు, ప్రాంతాల కమిటీ సమావేశంలో రామప్ప దేవాలయాన్ని వారసత్వ సంపద జాబితాలో చేర్చుతూ తీర్మానం చేసిన విష‌యాన్ని మంత్రి ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

ఈ స‌మావేశానికి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేంద‌ర్ రెడ్డి, ప‌ర్యాట‌క శాఖ‌ డైరెక్ట‌ర్ ఇలా త్రిపాఠి, పురావ‌స్తు శాఖ డెరెక్ట‌ర్ భార‌తీ హోలికేరి హాజ‌ర‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement