Tuesday, November 26, 2024

Delhi – బీఆర్ఎస్ పాలనలో నీళ్లు, నియామకాలకు మంగళం…. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం – భట్టి (వీడియోతో)

YouTube video

ఢిల్లీ – పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ఆర్థిక వ్యవస్థలను చిన్నభిన్నం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసిన తరువాత భట్టి మీడియాతో మాట్లాడుతూ,.ప్రధాని నరేంద్ర మోడీని కలవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రయోజనాల స్ఫూర్తితో.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం మొదటిసారి ప్రధానిని మర్యాద పూర్వకంగా కలిశామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, హక్కులను కాపాడుతూ.. అనేక అంశాలను దేశ ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లాం. కేంద్ర నుంచి రావాల్సినవి గత ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. మేము తీసుకొచ్చేందుకు ప్రయత్నించాం. వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన నిధులను కోరాం. తెలంగాణకు రావాల్సిన వాటిని త్వరగా అందేలా చూడాలని కోరాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పించాలని కోరాం. హైదరాబాద్ కి ఎంఐఎం, సైనిక్ స్కూల్ కల్పించాలని కోరాం. తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్న నీళ్లు, నియామకాల గురించి.. అయితే గత ప్రభుత్వం నీళ్లు, నియమకాలను పట్టించుకోలేదన్నారు. స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి అడిగినట్టు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement