Friday, November 22, 2024

వందశాతం వాక్సినేషన్ కు ప్రతినిధులు చొరవ చూపాలి : మంత్రి స‌బితా

వంద శాతం వాక్సినేషన్ జరిగేలా స్థానిక సంస్థల ప్రతినిధులు చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కోవిడ్ వాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్ పై జరుగుతున్న సమీక్ష సమావేశానికి ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సమావేశంలో మూసి రివర్ బోర్డు చైర్మన్ సుధీర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, అంజయ్య యాదవ్, కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగ రెడ్డి, జడ్పీ సీఈఓ, వివిధ శాఖల అధికారులు, ఆయా మండలాల ఎంపీపీ, జడ్పీటీసీలు, ఎంపీడీవో లు, తహసీల్దార్లు, మునిసిపల్ మేయర్, డిప్యూటీ మేయర్లు, చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లు హాజరయ్యారు.

ఈసంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…. కోవిడ్ మొదటి, రెండవ వేవ్ లో బాగా పనిచేసిన వైద్య విభాగం వారికి, మునిసిపల్, పంచాయతీ రాజ్, పోలీస్ శాఖల వారికి అభినందనలు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కోవటానికి ప్రభుత్వం, వైద్య శాఖ సిద్దంగా ఉందన్నారు. ప్రజాప్రతినిధులు పాఠశాలలను సందర్శించండి.. కోవిడ్ ప్రమాణాలు పాటించేలా చూడాల‌న్నారు. తక్కువ వాక్సినేషన్ ఉన్న ప్రాంతాలను గుర్తించి, ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టి పూర్తి స్థాయిలో వాక్సిన్ వేసేలా చూడాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించి జాగృత పర్చాలని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement