హైదరాబాద్ – ప్రేమోన్మాది వేధింపులకు యువతి బలి అయింది.అతడి టార్చర్ భరించలేక యాసిడ్ తాగి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోని న్యూ భవానీ నగర్ లో ప్రేమ పేరుతో నిఖిల్ వేధించడంతో నేడు పూర్ణిమ ఆత్మహత్య చేసుకుంది . దీంతో కుటుంబ సభ్యులు నిఖిల్ పై పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు నిఖిల్ ను అదుపులోకి తీసుకున్నారు.