Tuesday, November 19, 2024

TG | దేవాలయాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు…

మంథని, ఆంధ్రప్రభ : మంథని ప్రాంతంలో దేవాలయాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ శైలజ రామయ్యార్ ఆదేశించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథనిలోని మహా లక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గౌతమేశ్వర దేవాలయాన్ని పురావస్తు శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం పురపాలక కార్యాలయంలో దేవాలయాలు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…

కాళేశ్వరం దేవాలయం, మంథని పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను సందర్శించామన్నారు. కాళేశ్వరం-మంథని-రామగిరి సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కాళేశ్వరం దేవాలయం పరిసరాలలో అభివృద్ధి పనులు, భక్తులకు అవసరమైన వసతులు ఏ రకంగా కల్పించాలనే అంశం పై కాళేశ్వరంలో చర్చించామన్నారు.

గోదావరి నది ఏ రకంగా శుభ్రం చేయాలని, పుణ్య స్నానాలు చేసేందుకు అవసరమైన షవర్, మహిళలకు స్నానాల గదుల ఏర్పాటు మొదలగు అంశాలను చర్చించామన్నారు. మంథని లోని మంత్రపుట క్షేత్రంలో బౌద్ధ కాలం జన కాలం నాటి విగ్రహాలు దొరికాయని, ఇక్కడ దేవాలయాలను సందర్శించి పెద్దలు, అర్చకులు అధికారులతో చర్చించి అభివృద్ధికి ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు.

మంథనిలోని దేవాలయాలను సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు , వచ్చే భక్తులకు కావాల్సిన సదుపాయాల కల్పన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. దేవాలయాల అభివృద్ధికి రూపొందించే ప్రణాళికల్లో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఉండాలని సూచించారు. 2027 సంవత్సరంలో గోదావరి పుష్కరాలు వస్తున్నాయని, దానికి సంబంధించి ఘాట్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు.

- Advertisement -

గౌతమేశ్వర ఆలయం వద్ద పుష్కారాల సమయంలో పార్కింగ్ ఏర్పాటుకు అనువైన స్థలం గుర్తించాలన్నారు. మంథనిలో ఉన్న దేవాలయానికి ఒక గుడి నుంచి మరో గుడికి హెరిటేజ్ వాకింగ్ చేసే దిశగా ప్రణాళిక చర్యలు తీసుకోవాలన్నారు. దేవాలయాలకు సంబంధించి కామన్ పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వీలుగా కళాభారతి లాంటి భవనం నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement