Friday, November 22, 2024

TG: గోదా ‘వర్రీ’… తగ్గుముఖం

ఉదయం 10 గంటల వరకు 50.3 అడుగులు
రెండు గంటలకు 49.6 అడుగులు


భద్రాచలం, సెప్టెంబర్ 11 (ప్రభ న్యూస్): గోదావరి క్రమంగా తగ్గుతుంది. మంగళవారం ఒక్కరోజే రెండు హెచ్చరికలు జారీ చేయగా, వడివడిగా పెరిగిన గోదావరి, ఏజెన్సీ వాసుల్లో పెద్ద వర్రీనే సృష్టించింది. బుధవారం ఉదయం 10గంటల వరకు పెరుగుతూ ఉన్న గోదావరి 50.3 అడుగుల వద్ద స్థిరపడి అనంతరం తగ్గుతూ వచ్చింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గోదావరి నీటిమట్టం 49.6 అడుగులుగా నమోదైంది. భద్రాచలం నుంచి కూనవరం వెళ్లే మార్గం పైకి గోదావరి రావటంతో అంతరాయం కలిగింది.

మరోవైపు చర్ల వైపు వెళ్లే మార్గంలో కూడా కొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తాయి. భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా గోదావరి పోటెత్తడం వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. రానున్న రోజుల్లో వర్షం ఎక్కువగా లేనందువల్ల గోదావరి మరింత తగ్గే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా కూనవరం వద్ద శబరి పోటెత్తుతోంది. ఈ క్రమంలో గోదావరి నుంచి దిగువకు వెళ్లే ప్రవాహం కొంత నెమ్మదించవచ్చు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement