నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)9:కాంగ్రెస్ అహంకారాన్ని ఓడిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గ పిలుపునిచ్చారు. పీసీసీ అధ్య క్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఇతర నాయకులు విపరీ తమైన అహాన్ని ప్రదర్శిస్తు న్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అంటే ఆత్మీయత… కాంగ్రెస్ అంటే అహంకారమని అన్నారు. కాంగ్రెస్ లో ఒక్క కుర్చీ కోసం నాయకులు కొట్టుకుంటారని, ఇక కాంగ్రెస్ కు ప్రజల గురించి ఆలోచించే సమయం వారికి ఎక్కడ ఉంటుందని అడిగారు. నిజా మాబాద్ జిల్లా పార్టీ కార్యాల యంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి కవిత గారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత మాట్లాడు తూ తమ సీఎం అభ్యర్థి సీఎం కేసీఆర్… మరి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు
గుణమున్న గణేష్ కావాలా లేదా ధనమున్న ధన్ పాల్ కావాలా అన్నది నిజామాబాద్ తేల్చుకోవాలని, గుణమున్న గణేష్ గుప్తాను ప్రజలు గెలిపిం చుకుంటారన్న సంపూర్ణ విశ్వాసముందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలోనే గుణముందని తెలిపారు. ప్రజల కోసం మంచి చేసే వ్యక్తి గణేష్ అని చెప్పారు. నిజామాబాద్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించారని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం సీఎం కేసీఆర్ ను ఒప్పించి రూ. 45 కోట్లు తెచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అంటే పుష్పక విమానమని, ఎంత మంది వచ్చినా స్వాగతించామని, ఇంకా రావాలన్న కూడా స్థలముందని, అంత పెద్ద పార్టీ తమదని స్పష్టం చేశారు. డివిజన్ వారీగా సమన్వయం చేసుకోవాలని, తద్వారా ప్రతీ గల్లీలో తమకు ఎదురు ఉండదని స్పష్టం చేశారు. కనీసం 55 వేల మెజారిటీతో గణేష్ గుప్తాను గెలిపించడానికి కృషి చేయాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బి గాల, నగర మేయర్ దండు నీతూ కిరణ్, నగర అధ్యక్షులు సిరిప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు అలీమ్ ఖు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు