బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను క్వాష్ చేయాలని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం… పిటిషనర్ ఎవరైనా సరే తాము ఏకరీతి విధానాన్ని అనుసరిస్తామని వ్యాఖ్యానించింది. బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తాము అంగీకరించబోమని తెలిపింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచించింది. ఎవరైనా సరే బెయిల్ కోసం తొలుత కింది కోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది.
తన అరెస్ట్ చట్ట విరుద్ధమంటూ రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి కవిత లేవనెత్తిన అంశాలను… గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు ధర్మాసనం జత చేసింది. కేవలం రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలపై మాత్రమే విచారణ జరుపుతామని తెలిపింది. ఇదే విషయంపై దాఖలైన మరో పిటిషన్ తో కలిసి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.