Friday, November 22, 2024

TG: చేసేవి అప్పులు… చెప్పేది గొప్పలు… మోడీపై రేవంత్

ప్ర‌ధాని మోదీపై విరుచుకుప‌డ్డ రేవంత్
అదాని, మోడీ,అమీత్ షాలో చేతిలో దేశ సంప‌ద‌
హిండెన్‌బర్గ్ సంస్థ చెప్పిన నిజాల‌పై చ‌ర్య‌లు ఎక్క‌డ‌
పార్ల‌మెంట్లో అడిగితే పారిపోయిది మీరే
జెపిసి వేసే వ‌ర‌కూ పోరాటం చేస్తాం
మోదీని హెచ్చ‌రించిన రేవంత్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ -హైదరాబాద్‌: ఏ ప్ర‌దాని చేయ‌నన్ని అప్ప‌లు చేసి దేశాన్ని దివాళ తీయించిన మోదీ గొప్ప‌లు చెప్పుకుంటున్నార‌ని మండి ప‌డ్డారు టిపిసిసి చీఫ్, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. మోడీ ప్రధాని అయ్యే నాటికి దేశం అప్పు రూ.55 లక్షల కోట్లని.. నేడు అదే అప్పును రూ.1.55 లక్షల కోట్లకు చేర్చి దేశాన్ని అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు. దేశాన్ని మోదీ, అమిత్‌షా, అదానీ, అంబానీ చెరబట్టార‌ని మండి ప‌డ్డారు. దేశ సంప‌ద అంతా వారి గుప్పిట్లో చిక్కుకుపోయిందంటూ ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకుని కొందరికే లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా విధానాలకు నిరసనగా దేశంలోని అన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయాల ఎదుట కాంగ్రెస్‌ పార్టీ గురువారం ఆందోళనలు నిర్వహించింది. దీనిలో భాగంగా హైద‌రాబాద్ లోని ఈడీ కార్యాల‌యం వ‌ద్ద జ‌రిగిన ధ‌ర్నాలో రేవంత్ పాల్గొన్నారు..

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, దేశ సంపదను కార్పొరేట్లు ఎలా దోచుకుంటున్నారో హిండెన్‌బర్గ్ సంస్థ సహాసోపేతంగా బయట పెట్టిందని పేర్కొన్నారు. అదే అంశంపై ఇప్పటికే పార్లమెంట్‌లో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని గుర్తు చేశారు. అదానీ, అంబానీతో సహా మోడీ తన పరివారాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా జేపీసీ వేయాలంటూ పార్లమెంట్‌లో డిమాండ్ చేస్తే మోడీ తప్పించుకు తిరిగారని.. ప్లాన్ ప్రకారం నాలుగు రోజులు ముందుగానే పార్లమెంట్‌ను వాయిదా వేశారని మండిపడ్డారు. దేశ సంపదను అప్పనంగా దోచుకున్న వారిని పక్కాగా జైలుకు పంపే వరకు పోరాడతమని అన్నారు.

బ్యాంకుల జాతీయ చేసిన ఘ‌న‌త మాదే

- Advertisement -

ఆనాడు మహా నాయకురాలు ఇందిరా గాంధీ బ్యాంకులను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. నిరుపేదలకు భూములను పంచిన ఘటన కేవలం ఇందిరకే దక్కిందని అన్నారు. దేశంలో ఐటీ రంగానికి పునాది వేసిందే రాజీవ్ గాంధీయేనని గుర్తు చేశారు. పీవీ నరసింహా రావు లాంటి మహా నాయకులు అత్యుత్తమ సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని పేర్కొన్నారు. దేశానికి బీజేపీ ముప్పుగా పరిణమించిందని, ప్రజల సంపద ఎలా దోపిడీకి గురైందో అందరికీ తెలియాలని అన్నారు.

అ స‌న్నాసులు ఎక్క‌డ .

ప్రధాని మోడీపై కొట్లాడతామన్న సన్నాసులు ఏమయ్యారని బీఆర్ఎస్‌ను ఉద్దేశించి ఆయన ఫైర్ అయ్యారు. హిండెన్‌బర్గ్ అంశంలో బీఆర్ఎస్ విధానం ఏంటో చెప్పాలన్నారు. బీజేపీని సంతోష పెట్టేందుకే శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు రాజీవ్ పేరు తొలగిస్తామంటున్నారని ధ్వజమెత్తారు. ఒకవేళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టకుంటే వీపు చింతపండు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగం ఊడిన తరువాత వీళ్లకు తెలంగాణ తల్లిపై ప్రేమ పుట్టుకొచ్చిందని కామెంట్ చేశారు. ఇక హిండెన్‌డబర్గ్ అంశంపై పార్లమెంట్‌లో జేపీసీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ ఆందోళనలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వివేక్ వెంకట స్వామి, జయవీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement