Sunday, November 24, 2024

రుణమాఫీ అరిగోస.. మూడేళ్లు దాటినా త‌ప్ప‌ని ఎదురుచూపులు..

అచ్చంపేట రూరల్‌, (ప్రభన్యూస్‌): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ఎన్నికల సమయంలో లక్ష లోపు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పారని, అది నేటికీ చేయలేదని రైతులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో నోటికొచ్చిన వాగ్దానాలు చేసి గెలిచాక వాటిని నెరవేర్చక పోవడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కె సాద్యం అని రైతులు చర్చించుకుంటున్నారు. బ్యాంకులో క్రాఫ్‌ లోన్‌ తీసుకునేందుకు రైతులు పోతే బ్యాంకు అధికారులు పాత అప్పు కట్టండి, కొత్త అప్పు తీసుకోండి అని అంటున్నారని వాపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాఫీ చేశారుగా అంటే ఆ విషయం మాకు ఇంకా తెలియదని మాకు ఎటువంటి సమాచారం ప్రభుత్వం నుండి రాలేదని సమాధానం ఇస్తున్నారు.

ఒకవైపు రైతును రాజు చెయ్యడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం అంటూ మాట్లాడుతున్న నాయకులు రైతు నడ్డి విరుస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విడతల వారిగా రుణమాఫీ అన్నారు, మూడు సంవత్సరాలుగా రూ.25 వేల లోపు ఉన్న రైతులకు మొదటి విడత అని రూ.50వేల లోపు ఉన్న రైతులకు రెండవ విడత అని చెప్పి సంవత్సరం కావస్తున్నా ఇంత వరకు బ్యాంక్‌ అధికారులకు ఎటువంటి సూచనలు రాలేదని అధికారులు రైతులతో చెప్పడం జరుగుతుందని వాపోయారు. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ అవసరాలకు బ్యాంకు వద్దకు వెళ్లితే రూ.50 వేలు తీసుకున్న రైతుకు మిత్తితో కలిపి రూ.90 వేలు అయిందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. రైతు అప్పు పెరగడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కారణమని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా రైతు రుణమాఫీ విషయంలో స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement