తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ ఉభయ సభల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. 2024 – 25 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది.
- Advertisement -
జులై నెల వరకు అవసరాల కోసం 78,911 కోట్ల రూపాయల వినియోగం కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రతిపాదించారు. దానిపై నేడు శాసనసభ, శాసన మండలిలో చర్చ జరగనుంది. చర్చతో పాటు ప్రభుత్వ సమాధానం కూడా ఇవాళ్టి ఎజెండాలో పొందుపరిచారు. 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ వ్యయంపై చర్చ జరగనుంది.