Saturday, November 23, 2024

Deaths Report – బాస‌ర ట్రిపుల్ ఐటిలో మ‌ర‌ణాల‌పై నివేదిక కోరిన గ‌వ‌ర్న‌ర్….

హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధినుల మృతిపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నివేదిక ఇవ్వాల‌ని బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ విసి వెంకటరమణను కోరారు. ఈ మేరకు గవర్నర్ ఆదేశించారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఇంచార్జీ ఆదేశించారు. దురదృష్టకర ఘటనల నివారణకు చేపట్టిన చర్యలపై నివేదిక కూడా స‌మ‌ర్పించాల‌ని గవర్నర్ కోరారు..

కాగా, విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె కోరారు.. బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యాలపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని వైఎస్ చాన్సలర్ కు గవర్నర్ సూచించారు. విద్యార్ధుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆమె ఆదేశించారు. ఉన్నత విద్యను అభ్యసించి సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్దం కావాలని ఆమె కోరారు.

ఇది ఇలా ఉంటే బాసర ట్రిపుల్ ఐటీలో మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్ధినులు మృతి చెందారు. ఈ నెల 13వ తేదీన బాసర ట్రిపుల్ ఐటీలో దీపిక అనేక విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 15వ తేదీన తెల్లవారుజామున లిఖిత అనే విద్యార్ధినిమృతి చెందింది. బాసర ట్రిపుల్ ఐటీలోని హస్టల్ భవనం నాలుగో అంతస్థు పై నుండి కిందపడి లిఖిత మృతి చెందింది. మొబైల్ లో పాఠాలు చూస్తే ప్ర‌మాద‌వ‌శాత్తు అక్క‌డి నుంచి ప‌డి మ‌ర‌ణించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement