Saturday, November 16, 2024

NZB | త‌ల్లి చివ‌రి కోరిక‌ను తీర్చిన కుమార్తెలు… మృత‌దేహం ఆస్ప‌త్రికి విరాళం…

నిజామాబాద్ ప్రతినిధి, అక్టోబర్28 (ఆంధ్ర ప్రభ) : వైద్య కళాశాలకు తన తల్లి మృతదేహాన్ని అందజేసి సమాజం పట్ల బాధ్యతను చాటుకున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బోధన్ లో స్వర్గస్తురాలైన కమల మృతదేహాన్ని వారి కూతుర్ల ఆదేశానుసారం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రయోగశాలకు అందజేశారు.

కమల 15 రోజుల ముందే తన కూతుర్లు స్వర్ణలత, హేమలతకి తన తదనంతరం తన మృతదేహాన్ని ప్రయోగశాలకి ఇవ్వమని కోరడంతో సోమవారం వారు తన తల్లి కమల మృతదేహాన్ని రెడ్ క్రాస్ నిజామాబాద్ జిల్లా శాఖ ద్వారా ప్రయోగశాలకు ప్రొఫెసర్ రవీనాపౌల్ , ప్రొఫెసర్ డా.బాల్ రాజ్ కి ఇచ్చా రు.

ఇప్పటివరకు రెడ్ క్రాస్ ద్వారా 14 మృతదేహాలని ప్రభుత్వ కళాశాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశే ఖర్, కమల కూతుర్లు స్వర్ణ లతా గోపి, హేమలత కృష్ణ, బంధువులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement