Saturday, January 4, 2025

Date Fix – సాగు భూమికే భ‌రోసా …14 నుంచి రైతుల‌ ఖాతాల‌లో నిధులు జ‌మ‌

హైదరాబాద్: నూతన సంవత్సరం వేళ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పింది. పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిచ్చే రైతు భరోసా నిధులను 2025, జనవరి 14వ తేదీ నుండి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సూత్రపాయంగా నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా స్కీమ్ గైడ్ లైన్స్ రూపకల్పన కోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ గురువారం సచివాలయంలో భేటీ అయ్యింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి, కోమటిరెడ్డి సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రైతు భరోసా విధివిధానాల రూపకల్పనపై మంత్రి వర్గ ఉప సంఘం సుధీర్ఘంగా చర్చించారు.

సాగు భూమికే భరోసా నిధులు

గత బీఆర్ఎస్ ప్రభుత్వ మాదిరిగా కాకుండా కేవలం సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయాలని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది.. అలాగే రైతు భరోసా పథకం కోసం దరఖాస్తులు స్వీకరించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు రెండు రోజుల పాటు రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి.. వాటిని పరిశీలించిన అనంతరం విధివిధానాలు ఖరారు చేయనున్నారు.

- Advertisement -

శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా రాష్ట్రంలోని సాగు భూములు గుర్తించి కేవలం సాగుదారులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాల‌ని స‌బ్ క‌మిటే భేటిలో చ‌ర్చ జ‌రిగింది. అలాగే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని ఇందులో ఎలాంటి కోత పెట్టొదని మంత్రి వర్గం ఉప సంఘం సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

ధరణి పోర్టల్ ప్రకారం రాష్ట్రంలో ఒక కోటీ 53 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కోటీ 53 లక్షల ఎకరాలకు రైతు బంధు ఇచ్చింది. గుట్టలు, వెంచర్లు, సాగు చేయని భూములకు కూడా గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని.. ఇప్పుడు అలా కాకుండా కేవలం సాగు చేసే భూములకు రైతు భరోసా నిధులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.

ధరణి పోర్టల్ రికార్డుల ప్రకారం.. ఒక కోటీ 53 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఇందులో సాగు చేసే భూమి కోటీ 30 లక్షలు ఎకరాలుగా ప్రభుత్వం గుర్తించింది. కేవలం ఈ భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్న‌ది.. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం నాడు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి స‌బ్ నివేదిక అందజేస్తారు.. ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం మేర‌కు ఈ ప‌థ‌కం విధివిధానాలు ఖ‌రారు చేసి అర్హులైన రైతుల‌కు ఈ నెల 14 నుంచి వారి ఖాతాల‌లో నిధులు జ‌మ చేయ‌నుంది ప్ర‌భుత్వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement