హైదరాబాద్ : చేపమందు ప్రసాదం ప్రతి యేటా అందిస్తూ ఎందరికో ఆరోగ్యాన్ని ఇస్తున్న బత్తిని కుటుంబంలో నేడు విషాదం చోటుచేసుకుంది. బత్తిన కుటుంబంలో పెద్దవాడైన బత్తిన హరినాథ్ నేడు కన్నుమూశారు. ఆయన మరణంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్తమా రోగులకు ఎన్నో దశాబ్దాలుగా ఉచితంగా సేవలందిస్తున్న బత్తిన మరణం తననెంతో కలచివేసిందని ఆయన తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. బత్తిన మరణం పట్ల బత్తిన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని ప్రకటించారు.