Friday, November 22, 2024

బిఅర్ఎస్ హయాం లో అన్ని వర్గాల అభివృద్ధి.. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి – కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో తమ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పెద్దప ల్లి జిల్లా కేంద్రంలో పూసల సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి అన్ని కులాల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు.

తెలంగాణలో అమలవుతున్న ఏ ఒక్క పథకం భారత దేశంలోని ఏ రాష్ట్రంలో లేదన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసిఆర్ కిట్ లాంటి పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారన్నారు. గతంలో ఇచ్చిన మాదిరిగానే రాబోయే ఎన్నికల్లో సైతం మద్దతు ఇవ్వాలని కోరారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పూసల సంఘం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement