న్యూఢిల్లీ: అంటార్కిటికా ఖండంలో భీకర సునామీ లు రానున్నట్లు ఓ స్టడీ హెచ్చరిక చేసింది. వాతావరణ మార్పిడి వల్ల ఆ ప్రమాదం పొంచి ఉన్నట్లు వెల్లడించింది. ఆ సునామీల ప్రభావం యావత్ భూగోళంపై ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలోనూ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు అంటార్కిటికాలో ఇలాంటి పరిస్థితే ఎదురైందన్నారు. కనీసం మూడు డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ పెరిగితే, అప్పుడు అంటార్కిటికాలో భీకర స్థాయిలో సునామీలు తప్పవని స్టడీలో తెలిపారు. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ప్లైమౌత్ బృందం ఈ స్టడీ నిర్వహించింది. అంటార్కిటికాలో వచ్చే సునామీ అలలు దక్షిణ అమెరికా, న్యూజిలాండ్, ఆగ్నేయా ఆసియా దిశగా వెళ్తాయని అంచనా వేస్తున్నారు. అంటార్కిటాకా సునామీల వల్ల చాలా జీవాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అమేలియా షెవనెల్లి తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement