Friday, November 22, 2024

తీజ్ ఉత్స‌వాల్లో డ్యాన్స్ చేసిన – మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్

తీజ్ ఉత్స‌వాలు బ‌య్యారం మండ‌లంలో ఘ‌నంగా జ‌రిగాయి.ఇది గిరిజ‌నుల సాంస్కృతిక పండుగ‌. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీజ్ ఉత్సవాల్లో పాల్గొని ఆడిపాడారు. బయ్యారం మండలంలో జరిగిన తీజ్‌ ఉత్సవాల్లో ఎంపీ కవిత, జెడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌తో కలిసి ..గోధుమ మొలకల బుట్టలను నెత్తిన పెట్టుకొని నృత్యం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రకృతిని ఆరాధిస్తూ చేసుకునే గొప్ప పండుగ తీజ్ అన్నారు. సీఎం కేసీఆర్‌ గిరిజన పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాగే స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని ఆమె సూచించారు. శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు, ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు ఉండాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే లక్ష్యంతోనే వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ ఘనంగా నిర్వహిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement