Saturday, September 7, 2024

Dammayigudem – ఎసిబి కి చిక్కిన అవినీతి తిమింగలం.

కీసర , (ప్రభ న్యూస్): దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య 30 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.. ఏసీబీ డీఎస్పీ ఆనందు రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అహ్మద్గూడ కీసర మండలంలో నివసించే సుదర్శన్ అనే వ్యక్తి కంప్లైంట్ ప్రకారం మున్సిపల్ కార్యాలయం పై ఏసీబీ రైడ్ చేయగా 30వేలు తీసుకున్న మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య ను పట్టుకున్నామని తెలిపారు.

సుదర్శన్ కి అహ్మద్గూడా లో ఒక రైస్ మిల్, మూడు గుంటల భూమి ఉందని ఆ మూడు గుంటల భూమి, పక్కన వ్యక్తితో వివాదంలో ఉన్నదని ఆ భూమి పై కోర్టులో కేసు వెయ్యగా విచారణ జరుగుతుందని, ఆ భూమిలో పక్క అతను కాంపౌండ్ వాల్ కట్టడం జరిగిందని ఆ కాంపౌండ్ వాల్ కట్టడం వల్ల సుదర్శన్ రైస్ మిల్లుకు వెళ్లడానికి దారి లేకుండా పోయిందని దానితో అతను ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఆ గోడ కొంత భాగము ప్రభుత్వ భూమిలో ఉందని కొందరు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా, ఈ ఫిర్యాదు ఆధారంగా చేసుకొని మున్సిపల్ అధికారులు విచారణ చేయగా ఆ గోడ ప్రభుత్వ భూమిలో కట్టారని నిర్ధారణకు రాగ మున్సిపల్ అధికారుల గోడను కూల్చివేయడం జరిగింది.

ఆ గోడ కట్టిన వ్యక్తి కోర్టుకు వెళ్లి సెటస్కో ఆర్డర్ తీసుకొని మళ్ళీ గోడ కట్టడం జరిగిందనీ, దీనితో పిర్యాదు దారుడు మున్సిపల్ వారిని భాగస్వామ్యం చేస్తు మళ్లీ కోర్టుకు వెళ్లి అతను తెచ్చుకున్న కోర్ట్ ఆర్డర్ ను క్యాన్సల్ చేస్తే మళ్లీ మున్సిపాలిటీ అధికారుల ద్వారా ఆ గోడను తొలగించవచ్చని ఉద్దేశంతో ఆ కౌంటర్ ని మున్సిపాలిటీ నుండి ఫైల్ చేయడానికి 50వేల రూపాయలను కమిషనర్ రాజ మల్లయ్య డిమాండ్ చేయడం జరిగిందని, అందులో భాగంగా మొదటగా 20 వేల రూపాయలు 15 రోజుల క్రితమే ఇవ్వడం జరిగిందని, మిగతా 30 వేల రూపాయలను సోమవారం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నమని తెలిపారు.

- Advertisement -

ఇందులో ఇంకా ఎవరైనా భాగస్వామిగా ఉన్నారా.. మా విచారణలో తేలితే వారిపై కూడా చర్యలు చేపడతామని తెలిపారు.

ఫోటో రైటాప్ 001, ఎసిబి అధికారులకు పట్టుబడ్డ కమిషనర్ రాజమల్లయ్య ఫైల్ ఫోటో

Advertisement

తాజా వార్తలు

Advertisement