యాదాద్రి: దళిత గిరిజనులకు దక్కిన భూములు వారికే సొంతమవ్వాలని.. ఆ భూముల జోలికి ఎవరూ పోవద్దని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సర్వోదయ సంకల్ప్ పాదయాత్ర పేరుతో రాజీవ్ గాంధీ పంచాయితీ రాజ్ సంఘటన్, వినోదా జన్మాష్టమి ప్రటిస్తాన్ ఆధ్వర్యంలో భూదాన్ పోచంపల్లి నుండి మహారాష్ట్రలోని సేవాగ్రామ్ వరకు పాదయాత్రను ప్రారంభించారు. అభివృద్ది పేరుతో దళిత గిరిజనుల భూములు లాక్కొంటున్నారని, వారి భూములు వారికే దక్కాలన్న ఉద్దేశంతో 600కిలో మీటర్ల పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
దళిత గిరిజన భూములు అన్యాక్రాంతం కాకుండ ఉండేందుకు మీనాక్షి నటరాజన్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.
ఈ పాద యాత్రలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రచారకమిటి చైర్మెన్ మదు యాష్కీ గౌడ్ ,ఎమ్మెల్యే సీతక్క, ఏఐసిసి సెక్రెటరి బోస్ రాజు , మీనాక్షి నటరాజన్ , యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.