Monday, November 25, 2024

D A Pay – ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త… డి ఎ చెల్లింపు లకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించారు. అయితే అక్టోబర్ నెలలోనే తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చింది. దీంతో కొన్నింటికి ఆటంకాలు ఎదురయ్యాయి.

ఎన్నికల వేళ లబ్ది పొందేందుకు ప్రభుత్వం కొన్నింటిని అమలు చేస్తుందని భావించి ఈసీ అన్నింటిని నిలిపివేయించింది. తాజాగా ఎన్నికలు జరిగినప్పటికీ కోడ్ మాత్రం ఫలితాలు వచ్చేంత వరకు అమలు లోనే ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం విడుదల చేయాలనుకున్న డి ఏ ఎలక్షన్ కోడ్ కారణంగా నిలిపివేసారు.. అయితే మూడు డి ఏ లను ఉద్యోగులకు విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలని ఈసీకి రాష్ట్ర ప్రభుత్వము లేక రాసింది.

దీనిపై తాజాగా స్పందించిన ఎన్నికల సంఘం ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ చెల్లించేందుకు అనుమతిని ఇచ్చింది. అక్టోబర్ నెల నుంచి ఉద్యోగులకు డిఏ చెల్లింపునకు ఎటువంటి అభ్యంతరము లేదని ఈసీ చెప్పింది

Advertisement

తాజా వార్తలు

Advertisement