Friday, November 22, 2024

Cyberabad లో పెరుగుతున్న డ్ర‌గ్ కేసులు….. రూ. 232 కోట్లు మాయం కొట్టేసిన ఆన్ లైన్ కేటుగాళ్లు

సైబరాబాద్ పరిధిలో గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగిందని కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి తెలిపారు. గతేడాది 27, 322 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 29, 156 కేసులు రిజిస్ట్రర్ అయ్యాయి.. ఆయ‌న చెప్పిన వివ‌రాలు ప్ర‌కారం ఈ ఏడాది 105 హత్య కేసులు నమోదు కాగా, సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి.. గతేడాది 4, 850 కేసులు నమోదు కాగా 5, 342 సైబర్ క్రైమ్ కేసులు రికార్డ్ అయ్యాయి.. ఈ ఏడాది 3432 మందికి శిక్షలు ఖరారు అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక, 5342 సైబర్ క్రైమ్ కేసులు, సైబర్ క్రైమ్ ద్వారా 232 కోట్లు మాయం అయ్యాయి.. సైబర్ క్రైమ్ లో 46 కోట్లు రికవరీ చేశాం.. 277 డ్రగ్స్ కేసులు నమోదు,567 మంది అరెస్ట్ చేశామని సీపీ వెల్ల‌డించారు..

డ్ర‌గ్స్ కేసుల‌లో ఇద్ద‌రిపై పిడి యాక్ట్ న‌మోదు

డ్రగ్స్ కేసుల్లో ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. 6, 676 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాం.. డ్రగ్స్ కేసుల్లో 27 కోట్లు విలువ చేసే మత్తు పదార్ధులను అదుపులోకి తీసుకున్నాం.. 52, 124 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి.. ట్రాఫిక్ ఉల్లంఘనల ద్వారా 104 కోట్ల రూపాయల చలాన్ లు విధించాం.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన 24, 318 మంది డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేశామని ఆయన చెప్పారు. షీ టీమ్స్ ద్వారా 2, 587 మంది అరెస్ట్ చేశాం.. 52 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని సీపీ తెలిపారు.

277 డ్ర‌గ్ కేసులు …567 మంది అరెస్ట్ ..

ఈ ఏడాది 277 డ్రగ్ కేసులు నమోదు కాగా అందులో 567 మందిని అరెస్టు చేశామని సీపీ మహంతి తెలిపారు. ఇందులో ఇద్దరు సప్లయర్స్‌, 550 మంది పెడ్లర్స్ ఉన్నారు.. 6, 676 కిలోల గంజాయి, 13 లీటర్ల హాషిష్ ఆయిల్, 507 గ్రాముల కొకైన్, 261 గ్రాముల ఎండీఎంఏ, 120 గ్రాముల ఆల్ప్రోజోలం, 26 కిలోల ఛరస్‌ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 52, 124 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, 1271 మంది కి శిక్ష విధించాం.. ఛలాన్ల కింద 104 కోట్ల 54 లక్షల , 12 వేల పై చిలుకు వసూలు చేశాం.. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కింద 1347 ఆపరేషన్స్ చేసి 1829 చిన్నారుల రెస్క్యూ చేశామని ఆయన వెల్లడించారు. ఇక, కేపీ చౌదరి కేసులో దర్యాప్తు కొనసాగుతుంది.. చౌదరి కన్ఫెషన్ లో అతను చెప్పిన ప్రతి ఒక్కరిని విచారిస్తున్నాం.. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చాము.. కమర్షియల్ ఈవెంట్ కు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.. గైడ్ లైన్స్ పాటించాలి అని సీపీ అవినాస్ మహంతి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement