Monday, November 18, 2024

Cyber Criminals: టాస్క్‌ల‌ పేరుతో 11 లక్షలు కాజేసిన‌ సైబ‌ర్ కేటుగాళ్లు..

సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుంచి అధిక డబ్బు ఆశ చూపి రూ.41.29 లక్షలు కేటుగాళ్ళు కాజేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లాలో అమీన్ పూర్ లో ఉండే ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ పేరుతో మెసేజ్ వచ్చింది. దీంతో నిజమని నమ్మిన ఉద్యోగి మెసేజ్ కు రిప్లై ఇచ్చాడు.

అంతే కేటుగాళ్లు ఈ ఉద్యోకి తలపై టోకరాపై పెట్టేశారు. పక్కా ఉద్యోగం వస్తుందంటూ నమ్మించారు. అయితే పార్ట్ టైం జాబ్ వస్తుందని భావించిన ఉద్యోగి వాళ్లు చెప్పిన ప్రాసెన్ ఫాలో అయ్యాడు. ఉద్యోగం కోసం విడతల వారిగా రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ తరువాత వారికి కాల్ చేసిన నో రెన్పాన్స్ దీంతో మోసపోయానని భావించిన ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉద్యోగం వస్తుందని మోసపోయానని, తన డబ్బులు తనకు ఇప్పించాలని కన్నీరుమున్నీరయ్యాడు. ఇక మరోవైపు పటాన్ చెరులో ఉండే మరో ఉద్యోగి నుంచి రూ. 11.29 లక్షలను టాస్క్ ల పేరుతో సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఆలస్యంగా గమనించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement