Tuesday, November 26, 2024

కామారెడ్డిలో సైబర్ మోసం.. బ్యాంకర్ల పేరిట 2.48లక్షలు కొల్లగొట్టిన నేరగాళ్లు

కామారెడ్డి టౌన్, ప్రభన్యూస్ : కామారెడ్డి జిల్లాలో సైబ‌ర్ నేర‌గాళ్లు విజృంభించారు. మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన షేక్ షకీల్ కు బ్యాంక్ అధికారులమ‌ని ఫోన్ కాల్ చేసి 2.48 ల‌క్ష‌లు అకౌంట్ నుంచి కొల్లగొట్టారు. క్రెడిట్ కార్డ్ సీవీవీ నంబర్ ను రద్దు చేస్తామని, సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింద‌ని బాధితుడు తెలిపాడు. దీంతో అత‌ను ఆ నెంబ‌ర్ చెప్ప‌డంతో బాధితుడి మొబైల్ నెంబర్ కు మూడు ఓటీపీ లు వ‌చ్చాయి.

ఈ క్ర‌మంలోనే ఈ మోసం చేసిన‌ట్టు తెలుస్తోంది. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ఓటిపికి వచ్చిన 3 మెసేజ్ లను ఫార్వర్డ్ చేయడంతో బాధితుడు భారీ ఎత్తున డబ్బు కోల్పోయాడు. అనంతరం అకౌంట్ నుంచి మూడు దఫాలుగా 98,999, 99,500, 49,999 నగదును అకౌంట్ నుండి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. మొత్తం 2,48,498 లక్షల నగదును సైబర్ నేరగాళ్లు అకౌంట్ నుండి కొట్టేశారు. తాను మోసపోయానని గ్రహించి దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో షకీల్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement